chiranjeevi: 'రంగస్థలం' హిట్ కొడితే మళ్లీ మెగా హీరోతోనే సుకుమార్ మూవీ!

షార్ట్స్‌లో చూడండి
చరణ్ హీరోగా సుకుమార్ చేసిన 'రంగస్థలం', ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత సుకుమార్ ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ మూవీ మళ్లీ మెగా హీరోతోనే చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

 ఇటీవల ఆయన చిరంజీవిని కలిసి .. మాస్ ఎంటర్టైనర్ నేపథ్యంలోగల ఒక కథను వినిపించాడట. కథ బాగానే అనిపించినప్పటికీ, 'రంగస్థలం' ఫలితం చూసిన తరువాత ఓకే చెప్పవచ్చనే ఉద్దేశంతో చిరూ వున్నట్టుగా చెబుతున్నారు. ఇక గతంలో సుకుమార్ తో 'ఆర్య' .. 'ఆర్య 2' చేసిన అల్లు అర్జున్ కూడా, ఆయనతో ఒక సినిమా చేయాలని భావిస్తున్నాడట. అయితే 'రంగస్థలం' విడుదలైన తరువాతనే ఒక నిర్ణయానికి రావాలనేది ఆయన ఆలోచన. ఏం జరుగుతుందో చూడాలి మరి.  
Go Back to Shorts
chiranjeevi
allu arjun

More Telugu News