నితిన్ స్థానంలోకి నిఖిల్ .. అందుకు కారణం ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నితిన్ స్థానంలోకి నిఖిల్ .. అందుకు కారణం ఇదే!

  • వెంకీ కుడుముల నెక్స్ట్ మూవీకి రంగం సిద్ధం 
  • నితిన్ కి బదులుగా నిఖిల్ 
  • ఈ మార్పుకు కారణం బడ్జెట్   
'ఛలో' సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుని .. దర్శకుడిగా తన సత్తాను వెంకీ కుడుముల చాటుకున్నాడు. కథా కథనాలను .. పాత్రలను ఆయన ఆవిష్కరించిన తీరు మంచి మార్కులను తెచ్చిపెట్టింది. దాంతో చాలామంది యువ కథానాయకులు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

 ఈ నేపథ్యంలో నితిన్ తో ఆయన సినిమా చేయనున్నాడనీ .. సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారనే వార్తలు షికారు చేశాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో నితిన్ కి బదులుగా నిఖిల్ కి ఛాన్స్ లభించిందనేది ఫిల్మ్ నగర్ టాక్. సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు ఓ మాదిరి బడ్జెట్ లోనే ఈ సినిమాను పూర్తిచేయాలనే నిర్ణయానికి వచ్చారట. నితిన్ తో అయితే తాము అనుకున్న బడ్జెట్ దాటిపోతుందనే ఉద్దేశంతో నిఖిల్ ను సెట్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. 
nithin
nikhil

More Telugu News