రోజా.. నీ సంగతి అంతా తెలుసు.. నాతో పెట్టుకోవద్దు!: ఎమ్మెల్యే యరపతినేని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోజా.. నీ సంగతి అంతా తెలుసు.. నాతో పెట్టుకోవద్దు!: ఎమ్మెల్యే యరపతినేని

  • నన్ను విమర్శించే అర్హత నీకు లేదు
  • ముఖ్యమంత్రిపై, నాపై ఆరోపణలు చేస్తే ఊరుకోబోం
  • పల్నాడు అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "రోజా... నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ సంగతి మొత్తం నాకు తెలుసు. మిగిలిన వాళ్లతో పెట్టుకున్నట్టు నాతో పెట్టుకోవద్దు" అంటూ హెచ్చరించారు. మాచవరం మండలంలో జరిగిన దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే... చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

పల్నాడు ప్రాంతాన్ని ఎన్నడూ లేనంతగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తుంటే... ఓర్వలేక వైసీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మాచర్ల ఎమ్మెల్యే 500 మంది గూండాలతో, మారణాయుధాలతో దాడులు చేసి, పచ్చని పంట పొలాలను దున్నిన విషయం అందరికీ గుర్తుందని చెప్పారు. పంటలు నష్టపోయిన రైతులకు తన సొంత డబ్బు ఇచ్చి ఆదుకున్నానని తెలిపారు.
roja
yarapathineni
Chandrababu

More Telugu News