Chandrababu: ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు డ్రామాలాడుతున్నారు : వైవీ సుబ్బారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో సీఎం చంద్రబాబు డ్రామాలాడుతున్నారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన తమ ఎంపీలు ఐదుగురే అయినప్పటికీ, ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను తమ పార్టీ వినిపించిందని అన్నారు.

లోక్ సభ జరిగినంత కాలం అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తూనే ఉంటామని, చివరి రోజున తమ ఎంపీలందరూ రాజీనామా చేస్తారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని, హోదా సాధించే వరకు తాము వెనక్కి తగ్గమని, అవిశ్వాసంపై చర్చ చేపట్టకుండా సభ ఆర్డర్ లో లేదని లోక్ సభ స్పీకర్ అనడం అన్యాయమని ఆయన విమర్శించారు. లోక్ సభ ఆర్డర్ లేకపోయినా ఆర్థిక బిల్లుకు నాడు ఆమోదం ఎలా తెలిపారు? అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Chandrababu
YSRCP
yv subba reddy

More Telugu News