మళ్లీ ఎన్టీఆర్ ఎదుర్కొనే విలన్ ఆయనే!
Add ap7am to your home Screen

మళ్లీ ఎన్టీఆర్ ఎదుర్కొనే విలన్ ఆయనే!

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • విలన్ గా జగపతిబాబు
త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వచ్చేనెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరు? అనే ఆసక్తి అందరిలో మొదలైంది.

 ఎందుకంటే తన సినిమాల్లో విలన్ పాత్రలను త్రివిక్రమ్ చాలా డిఫరెంట్ గా మలుస్తాడు. ఆ విలన్ ను ఎదిరించే హీరోయిజాన్ని ఒక రేంజ్ లో ఆవిష్కరిస్తాడు. అలాంటి త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ తో చేయనున్న సినిమాలో విలన్ పాత్ర కోసం జగపతిబాబును ఎంపిక చేసినట్టుగా సమాచారం. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్ .. జగపతిబాబు కాంబినేషన్లోని సీన్స్ ను ప్రేక్షకులు అప్పుడే మరిచిపోలేరు. అలాంటి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం అందరిలో ఆసక్తిని రేకెత్తించే అంశమేనని చెప్పాలి.       
ntr
trivikram

More Telugu News