KTR: ఏదీ శాశ్వతం కాదని మరోసారి తేలిపోయింది: కేటీఆర్ కీలక వ్యాఖ్య

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో వెల్లడైన అనూహ్య ఫలితాలపై తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఫలితాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు వచ్చిన తరువాత ఖాళీ చేసిన పార్లమెంట్ సీట్లలో ఫలితాన్ని చూస్తే, ఏదీ శాశ్వతం కాదన్న విషయం తేటతెల్లమైందని తెలిపారు. ఇవే ఎన్నికల్లో మరో జాతీయ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని గుర్తు చేశారు. ఓ స్పష్టమైన మెసేజ్ ను ప్రజలు ఇచ్చారని అన్నారు. కేటీఆర్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Go Back to Shorts
KTR
BJP
Twitter
Uttar Pradesh

More Telugu News