బన్నీ ఎందుకంత స్టార్ అయ్యాడో తెలిసింది: 'నా పేరు సూర్య' విలన్
- బన్నీ చాలా హార్డ్ వర్కర్
- ఆయన అంకితభావం చూసి షాక్ అయ్యాను
- ఆయనతో పనిచేయడం గర్వంగా వుంది
తాజాగా ఆయన మాట్లాడుతూ .." ఈ సినిమాలో విలన్ గా నేను చేస్తోన్న పాత్ర నాకెంతో మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకం వుంది. ఫిట్ నెస్ కి సంబంధించిన విషయంలో బన్నీకి .. నాకు ఇంట్రెస్ట్ ఉండటం వలన చాలా తొందరగా కనెక్ట్ అయ్యాము. బన్నీతో కలిసే ప్రతిరోజు జిమ్ చేసేవాడిని. బన్నీ చాలా హార్డ్ వర్కర్ .. ఆయన అంకితభావం చూసి నేను షాక్ అయ్యాను. ఆయన ఇంత పెద్ద స్టార్ ఎలా అయ్యాడనే విషయం .. ప్రత్యక్షంగా చూడటం వలన నాకు తెలిసింది. ఆయనతో కలిసి పనిచేయడం గర్వంగా వుంది" అంటూ చెప్పుకొచ్చాడు.