ఆ సంస్థ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్
- సర్వీస్ కోసం యాక్ట్ ఫైబర్‌నెట్‌ను సంప్రదించిన దర్శకుడు
- తమ ఇంటికి వచ్చేందుకు అన్ని వివరాలు ఇచ్చిన హరీశ్ శంకర్
- అయినప్పటికీ అడ్రస్ కోసం 10 మంది నుంచి ఫోన్ కాల్స్
ఎంతమందితో ఇలా మాట్లాడి వివరాలు చెప్పాలని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, యాక్ట్ ఫైబర్ నెట్‌లో తాను 40 ఎంబీపీఎస్ ప్లాన్‌లో ఉంటే, 3 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్, 1.25 ఎంబీపీఎస్ అప్‌లోడ్ స్పీడ్ వస్తోందని ఈ రోజు ఉదయం కూడా హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి వచ్చే క్రమంలోనే యాక్ట్ ఫైబర్ నెట్ సిబ్బంది ఇలా 10 సార్లు ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది.