కేసుల మాఫీ కోసమే వైసీపీ నేతలు తిరుగుతున్నారు: మంత్రి కళా వెంకట్రావు

  • వైసీపీ ప్రజల కోసం పుట్టిన పార్టీ కాదు
  • స్వలాభం కోసం పుట్టిన పార్టీ  
  • రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీ చిత్తశుద్ధితో పని చేయడం లేదు
  • ఇటువంటి పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైసీపీ ప్రజల కోసం పుట్టిన పార్టీ కాదని, స్వలాభం కోసం పుట్టిన పార్టీ అని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీ చిత్తశుద్ధితో పని చేయడం లేదని, కేసుల మాఫీ కోసమే ఆ పార్టీ నేతలు తిరుగుతున్నారని ఆరోపించారు. ఇటువంటి పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వైసీపీ నేతలకు కేసుల మాఫీ, రాజకీయ లబ్దిపైనే శ్రద్ధ ఉందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. 
Go Back to Shorts
YSRCP
kala venkatrao
Telugudesam

More Telugu News