ntr: అన్నయ్యగా ఎన్టీఆర్ .. తమ్ముడిగా చరణ్

షార్ట్స్‌లో చూడండి
ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి ప్రాజెక్టుపైనే వుంది. ఎన్టీఆర్ ..చరణ్ ల కాంబినేషన్లో ఆయన చేసే మల్టీ స్టారర్ మూవీ పైనే అందరి ధ్యాస వుంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అంతా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ ల పాత్రలు ఎలా వుండనున్నాయనే కుతూహలంతో వున్నారు. ఈ సినిమాలో అన్నయ్యగా ఎన్టీఆర్ .. తమ్ముడిగా చరణ్ కనిపించనున్నారనేది తాజా సమాచారం.

 అయితే ఇంతకుముందు వినిపించినట్టుగా ఇది స్పోర్ట్స్ నేపథ్యానికి సంబంధించినది కాదు .. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాలు పెనవేసుకున్నదిగా ఈ కథ కనిపిస్తుంది. ఇక అన్నయ్యగా ఎన్టీఆర్ పాత్రను ..  తమ్ముడిగా చరణ్ పాత్రను రాజమౌళి ఎలా తీర్చిదిద్దనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి .  
Go Back to Shorts
ntr
charan

More Telugu News