సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • కొత్తగా కనపడాలన్నదే కీర్తి కోరికట!
  • మలయాళ 'ఆనందం' వచ్చేస్తోంది 
  • తమిళంలోకి మహేశ్ కౌబాయ్ చిత్రం  
*  'తెరపై ఎప్పుడూ ఒకేరకంగా కనపడడం అంటే నాకు ఇష్టం వుండదు.. ఎప్పటికప్పుడు కొత్తగా కనపడాలన్నదే నా కోరిక' అంటోంది కథానాయిక కీర్తి సురేశ్. "ఒకే తరహా పాత్రలు, గెటప్పులు బోర్ కొడతాయి. అది నాకిష్టం వుండదు, అందుకే ఎప్పటికప్పుడు కొత్తగా కనపడాలని కోరుకుంటాను. అలాంటి పాత్రలే రావాలని కోరుకుంటాను" అని చెప్పింది కీర్తి.
*  'ఆనందం' పేరుతో మలయాళంలో రూపొందిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 17న నిర్వహించి, చిత్రాన్ని ఈ నెల 23న రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు కోట్లతో నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో 20 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
*  మహేశ్ బాబు హీరోగా జయంత్ దర్శకత్వంలో పదహారేళ్ల క్రితం వచ్చిన కౌబాయ్ చిత్రం 'టక్కరిదొంగ' తమిళంలోకి డబ్ అయింది. 'వెట్రివీరన్' పేరిట ఈ చిత్రాన్ని ఈ రోజు తమిళ నాట రిలీజ్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ బిపాషాబసు కథానాయికగా నటించింది.   
Keerthi
Mahesh Babu
bipasha

More Telugu News