చంద్రబాబువి పచ్చి అబద్ధాలు... సాక్ష్యాలతో సహా నిరూపిస్తా: విష్ణుకుమార్ రాజు
- ఏపీకి నిధుల విషయంలో అబద్ధాలు
- డీపీఆర్ లు సమర్పించని సర్కారు
- అందువల్లే నిధుల మంజూరు ఆలస్యం
- ఎందుకంత రహస్యమని అడిగిన విష్ణుకుమార్ రాజు
అంచనా వ్యయాలు, పోలవరం ప్రాజెక్టుకు అవుతున్న ఖర్చు, రెవెన్యూ లోటు తదితరాంశాలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రహస్యంగా దాస్తోందని ప్రశ్నించిన ఆయన, అతి త్వరలో కేంద్రానికి అందిన డీపీఆర్, ఎల్ పీల గురించి కేంద్రానికి అందిన అన్ని పత్రాలనూ త్వరలోనే తీసుకొచ్చి నిజానిజాలను వెల్లడిస్తానని తెలిపారు. డీపీఆర్ లు కేంద్రానికి అందడం లేదు కాబట్టే నిధుల విడుదల ఆలస్యం అవుతోందని, అందుకు ప్రభుత్వమే కారణమని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.