krish: క్రిష్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ?

షార్ట్స్‌లో చూడండి
కథల ఎంపిక విషయంలో అల్లు అర్జున్ పెట్టే ప్రత్యేక శ్రద్ధను .. తన పాత్రలోని కొత్తదనం విషయంలో ఆయన తీసుకునే జాగ్రత్తలను అభినందించని వాళ్లంటూ వుండరు. ఒక సినిమా పూర్తయిన తరువాత మరో ప్రాజెక్టును సెట్ చేసుకోవడం .. దానిపైనే పూర్తి దృష్టి పెట్టడం అల్లు అర్జున్ కి అలవాటు. తన సక్సెస్ సీక్రెట్ అదేనని ఆయన భావిస్తూ ఉంటాడు.

ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఆయన చేస్తోన్న 'నా పేరు సూర్య ' షూటింగు పరంగా ముగింపుదశకి చేరుకుంది. దాంతో ఆయన తదుపరి సినిమా ఏ దర్శకుడితో వుండనుందా అనే ఆసక్తి అభిమానుల్లో రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో క్రిష్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల క్రిష్ వినిపించిన ఒక కథ అల్లు అర్జున్ కి బాగా నచ్చేసిందనీ, ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతుందని చెప్పుకుంటున్నారు.     
Go Back to Shorts
krish
allu arjun

More Telugu News