బాలీవుడ్ సెక్సీ భామకు చంపేస్తామంటూ బెదిరింపులు..!
- హేట్ స్టోరీ-4 హీరోయిన్‌పై వీక్షకుల గుస్సా
- తన పాత్రను ద్రౌపదితో పోల్చినందుకు సీరియస్
- చెత్త కామెంట్లతో పాటు లేపేస్తామంటూ వార్నింగ్
ట్రైలర్‌లో ద్రౌపదిని చాలా అసభ్యంగా చూపించారంటూ కొందరు వీక్షకులు మండిపడుతున్నారు. ఇది తమ మనోభావాలను గాయపరిచిందని వారు ఆరోపిస్తున్నారు. ఇందుకు కారణం... ఇందులో హీరోయిన్ ఊర్వశి క్యారెక్టర్ తనను ద్రౌపదితో పోల్చుకోవడమే. చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఆమె షాక్‌కు గురవుతోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ సినిమాలో ఊర్వశితో పాటు కరణ్ వాహీ, వివాన్ భతేనా, ఇహానా థిల్లాన్, గుల్షన్ గ్రోవర్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి దర్శకుడు విశాల్ పాండ్యా. నిర్మాత భూషణ్ కుమార్.