women: 14వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

షార్ట్స్‌లో చూడండి
చిన్న వయసులోనే పెళ్లయిన ఓ మ‌హిళ‌ ఇప్ప‌టికే 13 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఇద్దరు పిల్లలు చిన్నప్పుడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె పెద్ద కొడుకు వయసు 24 ఏళ్లు. తాజాగా ఆ మహిళ 14వ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్ బేగంగంజ్ జిల్లాలోని వీర్పూర్‌కు చెందిన 35 ఏళ్ల శారదా ప్రజాపతి అనే మహిళ గర్భిణి.

తాజాగా ఆమెకు పురిటినొప్పులు రావడంతో ఆమె పెద్ద కుమారుడు మరొకరితో కలిసి శారదను బుదేల్‌ఖండ్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె గర్భసంచి బలహీనంగా ఉందని గుర్తించిన వైద్యులు వెంటనే చికిత్స అందించి సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆ శిశువు 4 కిలోల బరువు ఉన్నాడని వైద్యులు చెప్పారు. గర్భాశయంలో తీవ్ర రక్తస్రావం అవడంతో శారద పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
Go Back to Shorts
women
pragnate
delivery

More Telugu News