Chandrababu: వైయస్ ఫ్రీగా ఇవ్వమని అడిగారు.. ఏదీ ఫ్రీగా ఇచ్చే ఆలోచన నాకు లేదు: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
దివంగత రాజశేఖరరెడ్డి, తాను ఇద్దరం మంచి స్నేహితులమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇద్దరం కలిసే తిరిగేవారమని చెప్పారు. ఆయనకు టికెట్ ఇవ్వాలని ఇందిరాగాంధీకి తానే చెప్పానని అన్నారు. ఆ తర్వాత తాను టీడీపీలోకి వచ్చానని, వైయస్ కాంగ్రెస్ లోనే ఉండిపోయారని తెలిపారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి వైరం లేదని... అయితే వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు పోరాటం సహజమేనని చెప్పారు.

వైయస్ కు చెందిన ఇంటి వివాదం గురించి మాట్లాడుతూ, ప్రభుత్వ భూమిలో ఆయన ఇల్లు కట్టుకున్నారని... ఈ మ్యాటర్ ను సెటిల్ చేయాలని కోర్టు ఆదేశించిందని... దీంతో, మార్కెట్ రేటు చెల్లించి, తీసుకోమని చెప్పామని... అయితే, ఫ్రీగా ఇవ్వాలని వైయస్ కోరారని... ఏదీ ఫ్రీగా ఇవ్వకూడదనేది తన ఆలోచన అని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఇచ్చిన ముఖాముఖి ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Chandrababu
ys rajasekhara reddy

More Telugu News