జస్ట్ మైగ్రేన్.. అంతే.. నేను బాగానే వున్నాను!: విశాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జస్ట్ మైగ్రేన్.. అంతే.. నేను బాగానే వున్నాను!: విశాల్

  • విశాల్ హాస్పిటల్లో చేరినట్టు వార్తలు 
  • అందులో నిజం లేదన్న విశాల్
  • తలనొప్పి మాత్రమేనంటూ వివరణ
తమిళ .. తెలుగు భాషల్లో యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. తన తమిళ సినిమాలను తప్పకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆయన తీసుకువస్తుంటాడు. ప్రస్తుతం ఆయన తమిళంలో వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. అయితే కొన్ని రోజులుగా ఆయన విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారనే వార్త కోలీవుడ్ లో షికారు చేస్తోంది. తలనొప్పిని భరించలేకపోయిన ఆయన చెన్నైలోని ఓ హాస్పిటల్ లో చేరినట్టుగా చెప్పుకున్నారు.

ఆ తరువాత ఆయన చెన్నై వైద్యుల సలహామేరకు అమెరికా వెళ్లాడనీ .. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయం విశాల్ వరకూ వెళ్లడంతో ఆయన స్పందించాడు. తనకున్న మైగ్రేన్ సమస్యకి జాగ్రత్తలు తీసుకుంటున్నాననీ .. త్వరలో పూర్తిగా నయమైపోతుందని చెప్పాడు. ఈ విషయంపై జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదనీ .. అదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశాడు. మార్చి ఫస్టు వీక్ నుంచి తిరిగి తాను షూటింగ్స్ లో పాల్గొననున్నట్టు చెప్పాడు.  
vishal

More Telugu News