కమలహాసన్ 'భారతీయుడు-2'లో కీలక పాత్రలో అజయ్‌ దేవగణ్‌‌?

  • ఇరవై రెండేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు 
  • దీనికి సీక్వెల్ పనులు మొదలు 
  •  కమల్ సరసన నయనతార 
కమలహాసన్ కథానాయకుడుగా ఇరవై రెండేళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమా ఒక సంచలనం సృష్టించింది. అవినీతిపై ఒక భారతీయుడు సాగించిన పోరాటంగా రూపొందిన ఆ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇన్నేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.

ఈ సీక్వెల్ లో కమల్ సరసన నయనతార నటించనుండగా, మరో కీలక పాత్రలో అజయ్ దేవగణ్ ను దర్శకుడు శంకర్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే శంకర్ ఈ సినిమా కథను అజయ్ కి వినిపించారని, దీంతో నటించేందుకు ఆయన ఆసక్తి చూపారని కోలీవుడ్ కథనం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు సమాచారం.
Go Back to Shorts
Kamal Haasan
Makkal Needhi Mayyam
Tamilnadu
Talking Movies

More Telugu News