నాని కాదు .. బన్నీ కాదు .. రవితేజతో రంగంలోకి హరీశ్ శంకర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాని కాదు .. బన్నీ కాదు .. రవితేజతో రంగంలోకి హరీశ్ శంకర్

  • హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'దాగుడుమూతలు' 
  • ఆ తరువాత సినిమాగా 'సీటీమార్'
  • రవితేజను ఒప్పించిన హరీశ్ శంకర్
దర్శకుడు హరీశ్ శంకర్ ప్రస్తుతం 'దాగుడుమూతలు' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనులతో బిజీగా వున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ .. నితిన్ కథానాయకులుగా నటించనున్నారు. ఈ సినిమా తరువాత 'సీటీమార్' అనే సినిమా చేయడానికి హరీశ్ శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.

 ముందుగా ఆయన ఈ సినిమాను నానితో చేయాలనుకున్నాడు. తాను బిజీగా వున్నానని నాని చెప్పడంతో, బన్నీతో చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. బన్నీకి హరీశ్ శంకర్ కథ వినిపించాడా .. లేదా? అనే విషయం తెలియదు గానీ, తెరపైకి తాజాగా రవితేజ పేరు వచ్చింది. రవితేజ .. హరీశ్ శంకర్ మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'మిరపకాయ్' సక్సెస్ అయింది. 'సీటీమార్' కథ వినిపించగానే రవితేజ ఓకే చెప్పేశాడని అంటున్నారు. వేసవిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలెట్టనున్నట్టు తెలుస్తోంది.   
raviteja
harish shankar

More Telugu News