Kamal Haasan: ‘సీక్రెట్’ విషయాన్ని బయటపెట్టిన కమల్.. రజనీకాంత్‌తో కారులో జరిగిన సమావేశం గురించి వెల్లడి!

షార్ట్స్‌లో చూడండి
రాజకీయాల్లోకి ప్రవేశించిన తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు కమలహాసన్ రెండు రోజుల క్రితం ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే పార్టీని ప్రకటించారు. తాజాగా తమిళ మ్యాగజైన్ ‘ఆనంద వికటన్’‌కు రాసిన ఓ వ్యాసంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు తాను సహనటుడు రజనీకాంత్‌తో ఓ కారులో రహస్యంగా సమావేశమైనట్టు అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలపై చర్చించామని, ఇద్దరం వేర్వేరు పార్టీలు పెట్టి ప్రత్యర్థులుగా మారినా హుందాగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

తాను హోస్ట్‌గా వ్యవహరించిన ‘బిగ్‌బాస్’ షూటింగ్ పూనమల్లెలోని ఓ ప్రైవేటు స్టూడియోలో జరుగుతుండగా, అక్కడికి సమీపంలో రజనీకాంత్ ‘కాలా’ సినిమా షూటింగ్ జరుగుతోందని, అప్పుడే వెళ్లి రజనీని కలిశానని కమల్ వెల్లడించారు.

‘‘మనం రహస్యంగా మాట్లాడుకుందామా? అని రజనీని అడిగా. ఇద్దరం కలిసి కారులో కూర్చుని మాట్లాడుకున్నాం. రాజకీయాల్లోకి రావాలనుకున్న నా నిర్ణయాన్ని చెప్పా’’ అని కమల్ వివరించారు. కమల్ నిర్ణయం విని రజనీకాంత్ ఆశ్చర్యపోయారట. రాజకీయాల్లోకి రావాలని తాను మానసికంగా సిద్ధమయ్యానని రజనీకి కమల్ చెప్పేశారట. అంతేకాదు.. అప్పటికే రాజకీయాల్లోకి వస్తున్నట్టు రజనీకాంత్ ప్రకటించడంతో భవిష్యత్తులో ఇద్దరం ప్రత్యర్థులుగా మారినా హుందాగా వ్యవహరించాలని కూడా అప్పుడే నిర్ణయించుకున్నట్టు కమల్ వివరించారు. 
Go Back to Shorts
Kamal Haasan
Rajinikanth
Tamilnadu

More Telugu News