Congress: రేపు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 'ఆంధ్రుల ఆత్మ గౌరవ దీక్ష’

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, మన హక్కుల సాధన కోసం ఏపీ కాంగ్రెస్ కమిటీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 23న నెల్లూరులో ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’ చేపట్టనున్నారు. ఈ దీక్షలో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు దీక్ష ప్రారంభమవుతుందని, ప్రకాశం జిల్లా మార్కాపురంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే దీక్షలోకూడా రఘువీరారెడ్డి పాల్గొంటారని పేర్కొంది.

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నిర్వహించే ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు పాల్గొననున్నారు. పార్టీలకు అతీతంగా పోరాడి మన హక్కులు సాధించుకుందామని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని ఈ ప్రకటనలో పేర్కొంది.
Go Back to Shorts
Congress
raghuveera reddy

More Telugu News