లాభాల బాటపట్టిన స్టాక్ మార్కెట్లు

  • 141.27 పాయింట్లు లాభపడ్డ  సెన్సెక్స్
  • 37.05 పాయింట్ల లాభంతో నిఫ్టీ
  • లాభపడ్డ సన్ ఫార్మా, బజాజ్ ఫైన్స్, టాటా స్టీల్ సంస్థల షేర్లు
వరుసగా మూడు రోజులు నష్టాలతో కొట్టుమిట్టాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 141.27 పాయింట్లు లాభపడి 33844.86 పాయింట్ల వద్ద, నిఫ్టీ 37.05 పాయింట్ల లాభంతో 10,397.45 పాయింట్ల వద్ద ముగిశాయి. షేర్ల విషయానికొస్తే.. ఓఎన్జీసీ, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ సంస్థల షేర్లు లాభపడగా, సన్ ఫార్మా, బజాజ్ ఫైన్స్, టాటా స్టీల్, ఇండస్ బ్యాంక్, హిందాల్కో సంస్థల షేర్లు నష్టాల బాట పట్టాయి. కాగా, డాలరుతో రూపాయి మారకం విలువ మరింతగా పడిపోవడంతో రూ.64.79కు చేరింది.
Go Back to Shorts
India
stock market

More Telugu News