jandhyala: ఫ్లాష్ బ్యాక్: జంధ్యాల చాలా కంగారు పెట్టేశారు: గుండు హనుమంతరావు

షార్ట్స్‌లో చూడండి
స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి సినిమా ఆర్టిస్ట్ గా మారిన నటుల్లో గుండు హనుమంతరావు ఒకరు. తనదైన డైలాగ్ డెలివరీతో .. చిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో ఆయన ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. మంచి నటుడిగా .. మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్న గుండు హనుమంతరావు, కొంతకాలం క్రితం ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ముచ్చటించారు. జంధ్యాల షూటింగులో జరిగిన ఒక సరదా సంఘటనను గురించి ప్రస్తావించారు.

"ఒకసారి నేను 'బాబాయ్ హోటల్' సినిమా షూటింగ్ చేస్తుంటే .. డ్రెస్ మార్చుకుని నా మెడలోని గోల్డ్  చైన్  .. వాచ్ తీసి టేబుల్ పై పెట్టాను. తల తిప్పి చూసేసరికి  అవి అక్కడ లేవు. అంతే, నేను కంగారు పడిపోయాను .. ఎవరిని అడిగినా చూడలేదని అంటున్నారు. 'అసలు అవి పెట్టుకొచ్చావా .. లేదా?' అని జంధ్యాల గారు సీరియస్ గా అడిగారు. 'ఎవరైనా చూస్తే చెప్పండయ్యా' అంటూ మిగతా వాళ్లతో చెప్పారు .. అలా 20 నిమిషాలు నన్ను కంగారు పెట్టేసి, 'ఇక ఇచ్చేయండయ్యా  ..లేదంటే ఇప్పుడు డైలాగ్ చెప్పలేడు' అంటూ నవ్వేశారు. అలా నన్నే కాదు ఎవరినైనా ఆటపట్టించడంలో ఆయన సిద్ధహస్తులు" అంటూ నవ్వేశారు.   
Go Back to Shorts
jandhyala
gundu hanumantha rao

More Telugu News