నిఖిల్ మూవీ కోసం షాలినీ పాండేతో సంప్రదింపులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిఖిల్ మూవీ కోసం షాలినీ పాండేతో సంప్రదింపులు!

  • 'కణితన్' రీమేక్ కి సన్నాహాలు 
  • షాలిని పాండేపై నిఖిల్ దృష్టి 
  • ఆమెతో దర్శక నిర్మాతల సంప్రదింపులు
'కిరాక్ పార్టీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి నిఖిల్ రెడీ అవుతున్నాడు. అలాగే తన తదుపరి సినిమాగా 'కణితన్' రీమేక్ చేయడానికి రంగంలోకి దిగనున్నాడు. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ వెర్షన్ ను తెరకెక్కించిన సంతోష్ .. తెలుగు సినిమాకి కూడా దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమాలో కథానాయికగా కేథరిన్ .. రష్మిక .. మేఘా ఆకాశ్ పేర్లు వినిపించాయి. అయితే వీరిలో ఎవరినీ ఎంపిక చేయలేదట. ఈ సినిమాలో పాత్ర పరంగా .. తన జోడీగా షాలినీ పాండే అయితే బాగుంటుందని నిఖిల్ భావిస్తున్నాడట. దాంతో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు. స్క్రిప్ట్ చూశాక ఒక నిర్ణయానికి వస్తానని ఆమె చెప్పడంతో, స్క్రిప్ట్ ను అందజేశారు. కథ .. తన పాత్ర తీరుతెన్నులు ఆమెకి నచ్చాయనీ, త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.     
nikhil
shalini

More Telugu News