Pawan Kalyan: చంద్రబాబు ‘తాన’ అంటే.. పవన్ కల్యాణ్ ‘తందానా’ అంటారు!: వైఎస్ జగన్

షార్ట్స్‌లో చూడండి
చంద్రబాబు ‘తాన’ అంటే పవన్ కల్యాణ్ ‘తందానా’ అంటారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ప్రజా సంకల్పయాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్సీ) అట! ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది.. ఏపీ ఎంత తీసుకుందో ఈ కమిటీ ద్వారా నిజ నిర్థారణ చేస్తారట!

ఇదంతా ఎలా ఉందంటే..కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ఉంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, రాష్ట్రానికి దండిగా నిధులు ఇచ్చారని ఒకవైపు చెబుతారు. ఎన్నికలొచ్చేటప్పటికి ఆయనే మళ్లీ ప్లేట్ మారుస్తూ.. నిధులేమీ ఇవ్వలేదని చెబుతున్నారు!  పవన్ కల్యాణ్, చంద్రబాబు చెయ్యాల్సింది కోడిగుడ్డు మీద ఈకలు పీకడం కాదు! ఏపీకి ప్రత్యేక హోదా మా హక్కు అని పోరాటం చేయాలి’ అంటూ ఘాటుగా విమర్శించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Chandrababu
jagan

More Telugu News