అటు పదవులూ కావాలి, ఇటు సన్నాయి నొక్కులూ నొక్కాలి: టీడీపీపై రోజా విమర్శలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అటు పదవులూ కావాలి, ఇటు సన్నాయి నొక్కులూ నొక్కాలి: టీడీపీపై రోజా విమర్శలు

  • ఏపీకి నాలుగేళ్లుగా అన్యాయం జరుగుతుంటే  ఏం చేస్తున్నారు?
  • అందరం కలిసి పోరాడదామంటే చంద్రబాబు అంగీకరించరు
  • ఎన్టీఆర్ ని మించిన నటనను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు
  • వైసీపీ ఎమ్మెల్యే రోజా 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపైన, ఆ పార్టీ ఎంపీలపైనా వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘ఏపీకి నాలుగేళ్లుగా అన్యాయం జరుగుతుంటే సీఎం చంద్రబాబు అడగకుండా ఏం చేస్తున్నారు? కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అందరం కలిసి పోరాడదామంటే చంద్రబాబు అంగీకరించరు! అందరినీ కలుపుకుని పోవాలంటే ఆయన ‘ససేమిరా’ అంటున్నారు. కేంద్రంలో పదవులూ కావాలి, ఇటు సన్నాయి నొక్కులు నొక్కాలన్నట్టుగా టీడీపీ ఆడుతున్న డ్రామాలను చూస్తున్నాం. ఈరోజున ఆ డ్రామాలు ఏ స్థాయికి వెళ్లాయంటే .. మహానటుడు ఎన్టీఆర్ ని మించిన నటనను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే, పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు ప్ల కార్డులు పట్టుకుని గొడవ చేస్తారు! కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్న టీడీపీ ఎంపీలు ఆ పదవులను దర్జాగా అనుభవిస్తారు! కొంచెం, కామన్ సెన్స్ ఉండే వాళ్లు ఆలోచిస్తే కనుక చంద్రబాబు ఆడే డ్రామాలేంటో అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై ఏపీకి ప్రత్యేక హోదాను సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.
YSRCP
roja

More Telugu News