ఒకాయన గుండు కొట్టించుకుంటాడు..మరో బోడిగుండాయన సన్మానాలు చేయించుకుంటాడు: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకాయన గుండు కొట్టించుకుంటాడు..మరో బోడిగుండాయన సన్మానాలు చేయించుకుంటాడు: రోజా

  • కేంద్రంపై చంద్రబాబు ఎందుకు పోరాడరు?
  • గల్లా జయదేవ్ ని బోడిగుండు ఆయనగా అభివర్ణించిన ఎమ్మెల్యే
  • ప్రత్యేక హోదా అనేది  జగన్ లాంటిది
  • ప్రత్యేక ప్యాకేజ్ అనేది చంద్రబాబునాయుడు ఇంట్లో ఉన్న ఎవరికీ పనికి రాని పప్పు లాంటిది : వైసీపీ ఎమ్మెల్యే రోజా
ఏపీకి కేంద్రం అన్యాయం చేయడంపై టీడీపీ నేతల నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఆ పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. కేంద్రం తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని నిరసన తెలియజేశారని, ఇంకో బోడిగుండు ఆయన (గల్లా జయదేవ్) కేంద్రం మనకు ఏదో చేసేసిందని చెప్పి సన్మానాలు చేయించుకుని ఊరేగుతున్నారని విమర్శించారు.

‘ఈ గల్లా జయదేవ్ ని నేనొక్కటే ప్రశ్నిస్తున్నాను. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో మీరు పెట్టుబడులు పెడతారా? ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టింది నిజం కాదా? సమయానికి టాయిలెట్లు కట్టకపోతే కలెక్టర్లపై పోరాటం చేస్తానంటూ చంద్రబాబునాయుడు వారిని బెదిరిస్తున్నారు. మరి, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా ఇవ్వనప్పుడు కేంద్రంపై పోరాటం చేస్తానని చంద్రబాబు ఎందుకు మాట్లాడట్లేదు? ప్రత్యేక హోదా అనేది వైఎస్ ఆర్ గారి కొడుకు జగన్ లాంటిది. ప్రత్యేక ప్యాకేజ్ అనేది చంద్రబాబునాయుడు ఇంట్లో ఉన్న ఎవరికీ పనికి రాని పప్పు లాంటిది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా వచ్చినప్పుడే ప్రతి జిల్లా హైదరాబాద్ లా అవుతుందని నాలుగేళ్లుగా జగన్ చెబుతూనే ఉన్నారు’ అని రోజా అన్నారు.
YSRCP
roja

More Telugu News