పవన్‌ కల్యాణ్‌ హావభావాలు చూస్తే నవ్వొస్తోంది: బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి
Add ap7am to your home Screen

పవన్‌ కల్యాణ్‌ హావభావాలు చూస్తే నవ్వొస్తోంది: బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి

  • చిరంజీవి కార‌ణంగా పవన్ సినిమాల్లోకి ప్ర‌వేశించాడు
  • పవన్ కు నట‌న కూడా రాదు
  • మీడియా మద్దతుతో రాజకీయ నాయకుడుగా వ‌ద్దామ‌ని చూస్తున్నాడు
  • మా పార్టీలో క్రమశిక్షణ ఎక్కువ
జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు పవన్‌ కల్యాణ్‌ హావభావాలు చూస్తే నవ్వొస్తోందని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ప‌వ‌న్ త‌న సోద‌రుడు చిరంజీవి కార‌ణంగా సినిమాల్లోకి ప్ర‌వేశించాడ‌ని, ఆయ‌న‌కు న‌ట‌న కూడా సరిగా రాద‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు మీడియా మద్దతుతో రాజకీయ నాయకుడుగా వ‌ద్దామ‌ని చూస్తున్నాడ‌ని అన్నారు.

ఈ రోజు కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...  త‌మ పార్టీలో క్రమశిక్షణ ఎక్కువ అని అన్నారు. రానున్న‌ ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదిగేందుకు తాము ప్ర‌ణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రేపు కోర్‌కమిటీ సమావేశంలో తాము త‌మ పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్‌షా పర్యటనపై చర్చిస్తామని తెలిపారు. ఇకపై త‌మ పార్టీ జాతీయాధ్యక్షుడు తరచూ తెలంగాణలో పర్యటిస్తారని అన్నారు.

రాష్ట్రంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే హంగ్ వస్తుంద‌ని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. తాము తెలంగాణ‌లో పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నామని, ఈ విష‌యంపై త‌మ పార్టీ చర్చలు జ‌ర‌పాల్సి ఉంద‌ని తెలిపారు. 
Chiranjeevi
Pawan Kalyan
kishan reddy
BJP

More Telugu News