Chandrababu: చంద్రబాబే ముందుండి నడిపించాలి.. పవన్ కల్యాణ్ కు అంత శక్తి లేదు: ముద్రగడ పద్మనాభం

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేసి వస్తే, వారి వెనుక నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కేంద్రం మెడలు వంచాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుండి ఉద్యమాన్ని నడిపించాలని చెప్పారు. ఉద్యమాలను నడిపించేంత శక్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేదని అన్నారు. మార్చి నెలాఖరులోగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తామేంటో మరోసారి చూపిస్తామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ముద్రగడ డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
Pawan Kalyan
mudragada padmanabham
Special Category Status

More Telugu News