mohan babu: మోహన్ బాబు మెచ్చుకోవడమంటే మాటలు కాదు!

షార్ట్స్‌లో చూడండి
విలక్షణమైన నటుడిగా సుదీర్ఘ కాలంగా మోహన్ బాబు తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. మోహన్ బాబు గురించి తెలిసినవారెవరైనా ఆయన ముక్కుసూటి మనిషనే అంటారు. ఏ విషయాన్నైనా ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. విమర్శలైనా .. ప్రశంసలైనా ముఖంపైనే చేసేస్తారు. ఆ విషయంలో ఆయనకి ఎలాంటి మొహమాటాలు వుండవు. అలాంటి మోహన్ బాబు మొన్నటి పబ్లిక్ ఫంక్షన్లోనే కాదు, తాజా ఇంటర్వ్యూలో సైతం శ్రియను ప్రశంసించారు.

మోహన్ బాబు తాజా చిత్రంగా 'గాయత్రి' ఈ రోజునే విడుదలైంది. ఈ సినిమాలో విష్ణు భార్య పాత్రలో శ్రియ నటించింది. తాజాగా మోహన్ బాబు మాట్లాడుతూ .. ఇండస్ట్రీకి నేను కొంతమంది కథానాయికలను పరిచయం చేశాను. వాళ్లంతా ఇప్పుడు బయట పోజులు కొడుతున్నారు. శ్రియను నేను పరిచయం చేయలేదు .. కానీ చాలా మంచి అమ్మాయి. ఈ సినిమాలో శ్రియ పోషించిన పాత్రను చూస్తే, ఆమె మాత్రమే చేయగలదనిపించింది. నాకే కాదు ఈ సినిమా చూసినవాళ్లెవరికైనా అదే అనిపిస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు. మోహన్ బాబు దగ్గర మంచి మార్కులు కొట్టేయడమంటే సామాన్యమైన విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       
Go Back to Shorts
mohan babu
shriya

More Telugu News