కాలమే సమాధానం చెబుతుంది!: కమలహాసన్‌తో కలిసి వెళ్లడంపై ర‌జ‌నీకాంత్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలమే సమాధానం చెబుతుంది!: కమలహాసన్‌తో కలిసి వెళ్లడంపై ర‌జ‌నీకాంత్‌

  • అందరిలోనూ ఇదే ప్రశ్న
  • రజనీ కాంత్‌ని ప్రశ్నించిన ఓ జాతీయ మీడియా
  • కాలమే సమాధానం చెబుతుందని రజనీ వ్యాఖ్య
త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున సినీ న‌టులు రాజకీయ రంగ ప్ర‌వేశం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అగ్ర‌న‌టులు ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల‌హాస‌న్ పార్టీ పెడుతున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించి అందుకు త‌గ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కాగా, ర‌జ‌నీ, క‌మ‌ల్ క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతారా? అన్న ప్ర‌శ్న అంద‌రిలోనూ ఉంది. ఇటీవ‌ల సినీన‌టుడు లారెన్స్ మీడియాతో మాట్లాడుతూ ఆ ఇద్ద‌రు న‌టులు రాజ‌కీయాల్లో కలిసి ముందుకు వెళితేనే బాగుంటుంద‌ని అన్నారు.

అయితే, దీనిపై ఈ రోజు ఓ జాతీయ‌ మీడియా ర‌జ‌నీకాంత్‌ని ప్ర‌శ్నించింది. క‌మ‌ల హాస‌న్‌తో క‌లిసి ముందుకు వెళ‌తారా? అని ప్ర‌శ్నించ‌గా కాల‌మే అన్నింటికి స‌మాధానం చెబుతుంద‌ని ర‌జ‌నీ కాంత్ అన్నారు. గ‌తంలోనూ ర‌జ‌నీ కాంత్ మీడియాకు ఇటువంటి స‌మాధానాలే ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం రజనీ, కమల్ వెబ్‌సైట్‌ల ద్వారా తమ పార్టీల కోసం సభ్యత్వాలు తీసుకుంటున్నారు. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్నారు. 
Rajinikanth
Kamal Haasan
politics

More Telugu News