నాకు కూడా సెకండ్ మూవీ కలిసొచ్చింది: నిహారిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు కూడా సెకండ్ మూవీ కలిసొచ్చింది: నిహారిక

  • చరణ్ కి రెండవ సినిమా కలిసొచ్చింది 
  • వరుణ్ తేజ్ కి రెండవ సినిమాతోనే హిట్ పడింది
  • నా విషయంలోను అదే జరిగింది
'ఒక మనసు' సినిమాతో తెలుగు తెరకి నిహారిక పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా, నటన పరంగా ఆమె మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో మంచి కథ కోసం వెయిట్ చేస్తూనే తమిళంలో ఆమె 'ఒరు నల్ల నాల్ పత్తు సొల్ రే' సినిమా చేసింది. జనవరి చివరి వారంలో విడుదలైన ఈ సినిమా, అక్కడ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

ఈ సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చుకోవడం పట్ల నిహారిక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, "మెగా ఫ్యామిలీలో కొందరికి సెకండ్ మూవీ హిట్ కావడం అనే సెంటిమెంట్ వుంది. చరణ్ రెండవ సినిమాగా చేసిన 'మగధీర' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక వరుణ్ తేజ్ చేసిన రెండవ సినిమా 'కంచె' సక్సెస్ ను సాధించింది. ఇక నా విషయానికే వస్తే తెలుగులో 'ఒక మనసు' మొదటి సినిమా కాగా, రెండవ సినిమాగా తమిళంలో 'ఒరు నల్ల నాల్ పత్తు సొల్ రే' చేశాను. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో, నా విషయంలోను ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయిందనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చింది.     
niharika

More Telugu News