అజిత్ తో సీక్వెల్ కి రెడీ అవుతోన్న గౌతమ్ మీనన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అజిత్ తో సీక్వెల్ కి రెడీ అవుతోన్న గౌతమ్ మీనన్

  • గౌతమ్ మీనన్ కి మంచి ఇమేజ్ 
  • అజిత్ కి విపరీతమైన క్రేజ్ 
  • త్వరలో మళ్లీ ఈ కాంబినేషన్ సెట్స్ పైకి  
తెలుగు .. తమిళ భాషల్లో దర్శకుడిగా గౌతమ్ మీనన్ కి మంచి ఇమేజ్ వుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానమైన చిత్రాలను తెరకెక్కించడంలో ఆయనకంటూ ప్రత్యేకమైన ముద్ర వుంది. ఆయన ఒక సినిమా చేయనున్నాడనగానే ఆ ప్రాజెక్టుపై ఆసక్తిని చూపే అభిమానులు పెద్ద సంఖ్యలోనే వున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక సీక్వెల్ కి రెడీ అవుతున్నారు.

గతంలో ఆయన అజిత్ హీరోగా చేసిన 'ఎన్నై ఆరిందాల్' (ఎంతవాడుగాని) ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయి. ప్రస్తుతం ధనుష్ తోను .. విక్రమ్ తోను గౌతమ్ మీనన్ సినిమాలు చేస్తున్నారు. ఇవి పూర్తి కాగానే అజిత్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈలోగా దర్శకుడు శివతో చేస్తోన్న 'విశ్వాసం' సినిమాను అజిత్ పూర్తి చేయనున్నాడని సమాచారం.     
ajith
gautham menon

More Telugu News