తెలుగు రాష్ట్రాల్లో 'టచ్ చేసి చూడు' తొలిరోజు షేర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు రాష్ట్రాల్లో 'టచ్ చేసి చూడు' తొలిరోజు షేర్

  • నిన్న విడుదలైన 'టచ్ చేసి చూడు'
  • అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లు 
  • ఈ సినిమాకి గట్టి పోటీ ఇస్తోన్న'ఛలో'
రవితేజ హీరోగా చేసిన 'టచ్ చేసి చూడు' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది.  ఏరియాల వారీగా షేర్ చూసుకుంటే .. నైజామ్ లో 1.56 కోట్లు .. సీడెడ్లో 47 లక్షలు .. నెల్లూరులో 20 లక్షలు .. గుంటూరులో 47 లక్షలు .. కృష్ణాలో 23 లక్షలు .. వెస్ట్ లో 30 లక్షలు .. ఈస్ట్ లో 45 లక్షలు .. ఉత్తరాంధ్రలో 48 లక్షలను వసూలు చేసింది.

 మొత్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 4.16 కోట్ల షేర్ ను రాబట్టింది. శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ వుంది . అయితే నాగశౌర్య - రష్మికలతో వెంకీ కుడుముల తెరకెక్కించిన 'ఛలో' .. 'టచ్ చేసి చూడు' సినిమాకి గట్టిపోటీ ఇస్తోందని అంటున్నారు.     
raviteja
rashikhanna

More Telugu News