Raviteja: 'టచ్ చేసి చూడు' రివ్యూ విషయంలో కత్తి మహేశ్ కి హైపర్ ఆది కౌంటర్

షార్ట్స్‌లో చూడండి
విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన 'టచ్ చేసి చూడు' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన కత్తి మహేశ్ రివ్యూ ద్వారా తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. కథ కలగాపులగంగా ఉందనీ .. ప్రేక్షకులను అయోమయానికి గురిచేసిందని ఆయన అన్నారు. వక్కంతం వంశీ ఇలాంటి కథను అందిస్తాడని తాను అనుకోలేదనీ, ఆయన నుంచి తాను ఇలాంటి కథను ఊహించలేదని చెప్పారు.

సినిమాటో గ్రఫీ ..ఎడిటింగ్ బాగున్నా, సన్నివేశాలు పేలవంగా వున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై హైపర్ ఆది స్పందిస్తూ "ముందు మీరు మంచి సినిమాలు తీయండి .. అప్పుడొచ్చి రివ్యూలు రాయండి'' అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. రివ్యూలను బహిష్కరించాలనీ .. తెలుగు సినిమాను సేవ్ చేయాలని చెబుతూ రవితేజకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.   
Go Back to Shorts
Raviteja
rashi khanna

More Telugu News