'టచ్ చేసి చూడు'లో రవితేజ దుమ్మురేపేశాడట!

  • ఈ రోజునే విడుదలైన 'టచ్ చేసి చూడు'
  • పోలీస్ ఆఫీసర్ గా రవితేజ 
  • ఆయన నటనకి ఫుల్ మార్క్స్
విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ చేసిన 'టచ్ చేసి చూడు' సినిమా, ఈ రోజునే భారీస్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటించిన ఈ సినిమాలో, రాశి ఖన్నా .. శీరత్ కపూర్ కథానాయికల పాత్రలను పోషించారు. ఈ సినిమా చూసినవాళ్లు ..  పోలీస్ ఆఫీసర్ కార్తికేయగా రవితేజ అదరగొట్టేశాడని అంటున్నారు.

ఫైట్లు .. డాన్సులు .. కామెడీ పంచ్ ల విషయంలో ఆయన దుమ్మురేపేశాడని చెబుతున్నారు. పోలీస్ పాత్రలో మెప్పించడం రవితేజకు అలవాటే. పోలీస్ పాత్రలో గతంలో ఆయన చేసిన సినిమాలు సక్సెస్ ను అందుకున్నాయి. అంతే ఎనర్జీ లెవెల్స్ తో ఆయన ఈ సినిమాలోను రెచ్చిపోయాడని అంటున్నారు. రొమాంటిక్ సీన్స్ ను .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను తనదైన శైలిలో పండించి, ఇది రవితేజ మార్క్ సినిమా అనిపించాడనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.   
Go Back to Shorts
Raviteja
rasikhanna
sheerath kapoor

More Telugu News