రాజమౌళితో త్వరలో సినిమా: ఫ్యాన్స్ తో ముచ్చట్లలో వెల్లడించిన రవితేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమౌళితో త్వరలో సినిమా: ఫ్యాన్స్ తో ముచ్చట్లలో వెల్లడించిన రవితేజ

  • ట్విట్టర్‌లో అభిమానులతో మాస్‌ మహారాజా ముచ్చట
  • అభిమానుల ప్రశ్నలకు సరదాగా సమాధానాలు
  • క్రికెట్ చూస్తా-రవితేజ
టాలీవుడ్ హీరో రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ట్విట్టర్‌లో తన అభిమానులతో మాస్‌ మహారాజా సరదాగా ముచ్చటించారు. రవితేజని ఆయన అభిమానులు ఫన్నీగా ప్రశ్నలు అడిగారు. ఒకరు 'ఏ ప్ల‌స్ బీ హోల్ స్వేర్ ఎంత‌?' అని అడగడం నవ్వులు పూయించింది.

ఫ్యాన్: టాలీవుడ్ యంగ్ హీరోల‌లో మీ ఫేవ‌రేట్ హీరో ఎవ‌రు?
ర‌వితేజ‌: రవితేజే

మాస్ మ‌హారాజా మెగాఫోన్ ప‌ట్టుకునే ఛాన్స్ ఉందా?
స్మైల్‌

బాలీవుడ్ లో మీ ఫేవ‌రేట్ హీరో?
ఎన్ని జ‌న్మ‌లెత్తినా అమితాబ్ బ‌చ్చ‌నే.

రాజ‌మౌళితో మ‌ళ్లీ సినిమా ఎప్పుడు.. ప్లీజ్?
త్వ‌ర‌లో

వైజాగ్ లో షూటింగ్ ఎక్కడ అన్నా?
చెప్పేస్తారు మరీ

త్వ‌ర‌లో హాస్య‌న‌టుడిగా క‌న‌ప‌డ‌తారా?
నా సినిమాల్లో కామెడీ స‌రిపోలేదా?

మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఏమైనా ప్లానింగ్ ఉందా?
లేదు

ఒక సైన్స్ ఫిక్ష‌న్ చేయి అన్నా
మంచి స్క్రిప్ట్ వ‌స్తే చేస్తాను

ఏ ప్ల‌స్ బీ హోల్ స్క్వేర్ ఎంత‌?

స్మైల్‌

అన్న‌య్య, ఇండ‌స్ట్రీలో హీరోయిన్లలో ఎవ‌రినైనా ల‌వ్ చేశారా?

అబ్బ‌చా

క్రికెట్ చూస్తారా?

చూస్తా.. ఫేవ‌రేట్ క్రికెట‌ర్ ఎవ‌ర‌ని అడ‌గొద్దు. టీమిండియా క్రికెట‌ర్లు అందరూ ఇష్ట‌మే.
Raviteja
Twitter
chat

More Telugu News