రవితేజతో మళ్లీ జోడీ కడుతోన్న కాజల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజతో మళ్లీ జోడీ కడుతోన్న కాజల్

  • శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంథోని'
  • ఒక కథానాయికగా నివేదా థామస్ 
  • ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్    
ఒక వైపున 'టచ్ చేసి చూడు' విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, మరో వైపున కల్యాణ్ కృష్ణతో 'నేల టికెట్' .. శ్రీను వైట్లతో 'అమర్ అక్బర్ అంథోని' సినిమాలు రవితేజ చేతిలో వున్నాయి. ఇప్పటికే 'నేల టికెట్' షూటింగ్ 25 శాతం పూర్తి కాగా, సెట్స్ పైకి వెళ్లడానికి 'అమర్ అక్బర్ ఆంథోని' రెడీ అవుతోంది. ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు.

ఒక కథానాయికగా నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరో కథానాయికగా కాజల్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. గతంలో రవితేజ .. కాజల్ కాంబినేషన్లో 'సారొచ్చారు' వచ్చింది గానీ సరిగ్గా ఆడలేదు. అయినా ఈ సినిమాలో కాజల్ కి ఛాన్స్ దక్కడం విశేషం. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.     
raviteja
Kajal Agarwal

More Telugu News