ప్రయోగాలు చేయనుగాక చేయను: రవితేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రయోగాలు చేయనుగాక చేయను: రవితేజ

  • నా స్టైల్లోనే నా సినిమాలు ఉండాలి 
  • లేదంటే అవి ఆడటం లేదు 
  • అందుకు ప్రయోగాల జోలికి పోదలచుకోలేదు    
రవితేజ తాజా చిత్రంగా వచ్చేనెల 2వ తేదీన 'టచ్ చేసి చూడు' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో రవితేజ బిజీగా వున్నాడు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఉండగా, ఆయన సినిమాలు ఒకేలా ఉంటున్నాయనీ .. ఒక తరహాగా అనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అందుకు రవితేజ తనదైన శైలిలో స్పందిస్తూ .. " కొత్తగా అనిపించాలనే ఉద్దేశంతో ప్రయోగాలు ఎందుకు చేయాలి? అంటూ అడిగారు. "గతంలో నేను 'శంభో శివ శంభో' .. 'నేనింతే' .. ' నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' వంటి సినిమాల్లో ఛాలెంజింగ్ రోల్స్ చేశాను. కానీ అవేమీ పెద్దగా ఆడలేదు. జనాలు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో .. వాళ్లకి నేను అలాగే కనిపించాలని నిర్ణయించుకున్నాను. నా మార్క్ లో నేను సినిమాలు చేయకపోతే అవి ఆడటం లేదు. ప్రయోగాల పేరుతో ముందుకు వెళితే రిజల్ట్ తేడా కొట్టేస్తోందని రవితేజ చెప్పుకొచ్చారు.    
raviteja
rasi khanna

More Telugu News