హీరోని డామినేట్ చేస్తానంటున్న శీరత్ కపూర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోని డామినేట్ చేస్తానంటున్న శీరత్ కపూర్!

  • శీరత్ కపూర్ తాజా చిత్రంగా 'టచ్ చేసి చూడు'
  • వచ్చేనెల 2న విడుదల 
  • తదుపరి చిత్రం సురేశ్ ప్రొడక్షన్స్ లో      
తెలుగు తెరపై గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేస్తూ దూసుకుపోతోన్న కథానాయికల జాబితాలో శీరత్ కపూర్ ఒకరుగా కనిపిస్తుంది. 'రన్ రాజా రన్' .. 'టైగర్'.. 'ఒక్క క్షణం' వంటి భారీ సక్సెస్ లు ఆమె ఖాతాలో వున్నాయి. ఆమె తాజా చిత్రంగా వచ్చేనెల 2వ తేదీన 'టచ్ చేసి చూడు' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సినిమాలో తన పాత్ర హీరో పాత్రనే డామినేట్ చేసేలా ఉంటుందనీ .. సెకండాఫ్ లో వస్తుందని చెప్పింది. రవితేజతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి అనీ, ఆయన సరసన చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అంది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. తన తదుపరి సినిమా సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో .. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఉండనుందని చెప్పుకొచ్చింది.     
raviteja
rasikhanna
sheerath kapoor

More Telugu News