బీ రెడీ! ‘జీఎస్టీ’ నేడే విడుదల.. మాల్కోవా అందాలు, కీరవాణి సంగీతం వినాలంటూ వర్మ ట్వీట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీ రెడీ! ‘జీఎస్టీ’ నేడే విడుదల.. మాల్కోవా అందాలు, కీరవాణి సంగీతం వినాలంటూ వర్మ ట్వీట్

  • ముందుగా చెప్పినట్టు శుక్రవారమే సినిమా విడుదల
  • లక్షలాదిమంది  ఒకేసారి క్లిక్ చేయడంతో క్రాష్
  • సమస్యలను సరిదిద్ది రెడీ చేసిన వర్మ
‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) పేరుతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిలో వేడి పుట్టించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు ఆ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. నిజానికి ఈ లఘు చిత్రాన్ని అనుకున్నట్టే శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేశాడు. అయితే ఒకేసారి లక్షలాదిమంది వీడియోను క్లిక్ చేయడంతో అది కాస్తా క్రాష్ అయింది. దీంతో వీడియో ప్లే కాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

దీనిపై స్పందించిన వర్మ లక్షలాదిమంది ఒకేసారి క్లిక్ చేయడం వల్ల సమస్య ఏర్పడిందని, సమస్యను సరిదిద్దే పనిలో ఉన్నామని ట్వీట్ చేశాడు. శనివారం ఉదయం 9 గంటలకు గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాలని కోరాడు. శృంగార తార మియా మాల్కోవా అందాలను, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అద్భుతమైన మ్యూజిక్‌ను వినొచ్చని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
RGV
God S*x and truth
movie

More Telugu News