హీరోగా మారుతున్న ప్రముఖ నిర్మాత తనయుడు!

సీనియర్ హీరోలు .. దర్శకులు .. నిర్మాతలు తమ వారసులను వెండితెరకి హీరోలుగా పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలైన అల్లు అరవింద్ తనయుడు బన్నీ, సురేశ్ బాబు తనయుడు రానా, సుధాకర్ రెడ్డి తనయుడిగా నితిన్ .. బెల్లంకొండ సురేశ్ తనయుడిగా శ్రీనివాస్ హీరోలుగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో మరో నిర్మాత కూడా తన తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు .. ఆయనే డీవీవీ దానయ్య.

 స్టార్ హీరోలతో .. భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించిన దానయ్య ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. తన తనయుడు కల్యాణ్ ను హీరోగా పరిచయం చేసే దిశగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. కల్యాణ్ ను హీరోగా చేసే బాధ్యతను చేపట్టమంటూ ఆయన వినాయక్ కు భారీ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినట్టుగా సమాచారం. ఇక హీరో కావాలనే పట్టుదలతో ఫిట్ నెస్ పై కల్యాణ్ దృష్టి పెట్టడమే కాకుండా, ఇప్పటికే డాన్సులు .. ఫైట్ల విషయంలో శిక్షణ పొందినట్టుగా చెబుతున్నారు. 
Go Back to Shorts
kalyan

More Telugu News