Kamal Haasan: మా ఇద్దరి ఆశయం ఒకటే!: కమల హాసన్

షార్ట్స్‌లో చూడండి
తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ లక్ష్యం, తన లక్ష్యం ఒకటేనని విలక్షణ నటుడు కమలహాసన్‌ అన్నారు. చెన్నై ఎయిర్ పోర్టులో తనను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ, తమిళనాడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ఆశయమని అన్నారు. రాష్ట్రంలోని కొన్ని సమస్యలు పరిష్కరించేందుకు కేవలం మాటలు సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు.

రజనీ చెప్పినట్లు రాష్ట్రంలో ఆధ్యాత్మిక రాజకీయాలు సాధ్యమవుతాయో లేదో కానీ, రాష్ట్రాభివృద్ధి మాత్రం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. త్వరలో నిర్వహించనున్న స్ధానిక ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో నిర్ణయించేందుకు కార్యకర్తలతో సమావేశమవుతానని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 21న రామనాధపురంలో పార్టీ వివరాలు వెల్లడిస్తానని ఆయన చెప్పారు.

జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. విలువలేని ప్రాంతాల్లో తమిళ ప్రార్థన గీతాన్ని ఆలపించకూడదని ఆయన సూచించారు. లేని పక్షంలో కంచి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి వివాదం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. 
Go Back to Shorts
Kamal Haasan
rajanikanth
Tamilnadu
politics

More Telugu News