రిలీజ్ డేట్ మార్చుకోనున్న 'మహానటి'?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రిలీజ్ డేట్ మార్చుకోనున్న 'మహానటి'?

  • ముగింపు దశలో 'మహానటి'
  • సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ 
  • వేసవి సెలవుల్లో విడుదల ఆలోచన  
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సావిత్రి జీవితచరిత్రగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తుండగా .. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. ఇక ఎస్వీ రంగారావు పాత్రను మోహన్ బాబు చేస్తుండగా, ఇతర ముఖ్య పాత్రలను ప్రకాశ్ రాజ్ .. విజయ్ దేవరకొండ ..  సమంత .. షాలినీ పాండే పోషిస్తున్నారు.

 కె.వి. రెడ్డి .. సింగీతం శ్రీనివాసరావు పాత్రల్లో క్రిష్ .. తరుణ్ భాస్కర్ కనిపించనున్నారు. ఈ సినిమాను మార్చి 29వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ లోగా పూర్తయ్యే అవకాశాలు లేవట. అందువలన వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.        
keerti suresh
samanta

More Telugu News