మదర్ రోల్ చేయడానికి గర్వపడతాను: ఆమని
Add ap7am to your home Screen

మదర్ రోల్ చేయడానికి గర్వపడతాను: ఆమని

  • యంగ్ హీరోల సినిమాలు చూస్తుంటాను 
  • అంతా చాలా బాగా చేస్తున్నారు 
  • ఎవరి స్టైల్ వారికి వుంది  
"ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోల్లో ఎవరి సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు? వాళ్లకి మదర్ గా చేసే అవకాశం వస్తే చేస్తారా?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆమనికి ఎదురైంది. అందుకామె స్పందిస్తూ .. "ఇప్పుడున్న యంగ్ హీరోలంతా నాకు ఇష్టమే. ఎవరికి వారు తమదైన స్టైల్లో చాలా బాగా చేస్తున్నారు. అందరి సినిమాలు చూస్తూ వుంటాను.

వీళ్లలో ఎవరికి మదర్ గా చేయమన్నా చేస్తాను. నేను హీరోయిన్ గా చేయడం ఇప్పుడు కుదరదనే విషయం నాకు తెలుసు .. అడిగినా ఇవ్వరు కూడా. అందువలన నేను మదర్ గా చేయవలసిందే .. అలా చేయడాన్ని నేను గర్వంగా ఫీలవుతాను. అందువలన మంచి పాత్రలు రావాలేగాని చేయడానికి నేను సిద్ధంగా వున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.  
aamani

More Telugu News