ఆస్కార్ నామినేష‌న్ల‌ను ప్రియాంక వెల్ల‌డించ‌లేదు.. జ‌స్ట్ కొద్దిసేపు క‌నిపించిందంతే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆస్కార్ నామినేష‌న్ల‌ను ప్రియాంక వెల్ల‌డించ‌లేదు.. జ‌స్ట్ కొద్దిసేపు క‌నిపించిందంతే!

  • సినిమాటోగ్ర‌ఫీ ప్రోమోలో క‌నిపించిన పీసీ
  • నామినేష‌న్లను వెల్ల‌డించిన ఆండీ సెర్కిస్, టిఫ‌నీ హ‌డ్డిష్‌
  • మార్చి 4న ఆస్కార్ అవార్డుల వేడుక‌
ఆస్కార్ అవార్డుల నామినేష‌న్ల‌ను భార‌తీయ న‌టి ప్రియాంక చోప్రా వెల్ల‌డించ‌బోతుంద‌ని ఇటీవల వార్త‌లు వ‌చ్చాయి. ఆస్కార్ నిర్వాహ‌కులు నామినేష‌న్ల ప్రోమో వీడియో షూటింగ్ ఫొటోల‌ను షేర్ చేయ‌డం వ‌ల్ల ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. కానీ నిన్న‌టి ఆస్కార్ నామినేష‌న్ల ప్ర‌క‌ట‌న‌లో ప్రియాంక జ‌స్ట్ కొద్దిసేపు మాత్రం క‌నిపించిందంతే! దీంతో ఆమె అభిమానులు కొంత నిరుత్సాహ‌ప‌డ్డారు.

ఆస్కార్ నామినేష‌న్ల‌ను విభాగాల వారీగా న‌టుడు ఆండీ సెర్కిస్‌, న‌టి టిఫ‌నీ హ‌డ్డిష్‌లు వెల్ల‌డించారు. అందులో భాగంగా సినిమాటోగ్ర‌ఫీ విభాగం ప్రోమోలో ప్రియాంక మెరిసింది. ఆమెతో వివిధ భాగాలకు ఒక్కొక్క‌రు చొప్పున స‌ల్మా హ‌యెక్‌, మిషెల్ రోడ్రిగేజ్‌, రెబెల్ విల్స‌న్‌, మిషెల్ యో, రొసారియో డాస‌న్‌, గాల్ గ‌డాట్ వంటి న‌టీమ‌ణులు క‌నిపించారు. మార్చి 4న ఆస్కార్ అవార్డుల వేడుక జ‌ర‌గ‌నుంది.

priyanka chopra
oscars
nominations

More Telugu News