బుల్ పరుగులు... 11 వేల మార్క్ ను దాటేసిన నిఫ్టీ!
- తొలిసారిగా 11 వేల మార్క్ ను తాకిన నిఫ్టీ
- ఉత్సాహంగా పెట్టుబడులు పెడుతున్న విదేశీ ఇన్వెస్టర్లు
- 36 వేల మార్క్ ను దాటి ముందుకు వెళుతున్న సెన్సెక్స్
మంగళవారం ఉదయం 10.20 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, క్రితం ముగింపుతో పోలిస్తే 236 పాయింట్లు పెరిగి 36,034 పాయింట్లకు చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 78 పాయింట్లు పెరిగి 11,044 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అర శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ-50లో 36 కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి. హిందాల్కో, వీఈడీఎల్, టాటా స్టీల్, ఐఓసీ, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు రెండు నుంచి ఐదు శాతం లాభాల్లో కొనసాగుతుండగా, జడ్ఈఈఎల్, అంబుజా సిమెంట్స్, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, విప్రో తదితర కంపెనీలు అర శాతం నుంచి 1.70 శాతం నష్టాల్లో నడుస్తున్నాయి.