నేను పుట్టినప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నాను: త‌మిళ న‌టుడు ఉదయనిధి స్టాలిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను పుట్టినప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నాను: త‌మిళ న‌టుడు ఉదయనిధి స్టాలిన్

  • డీఎంకే పార్టీ నా రక్తంలోనే ఉంది
  • గతంలో మా నాన్న స్టాలిన్‌ కోసం ప్రచారం చేశా
  • సినిమాల్లోకి వచ్చాక రాజకీయాలకు దూరంగా ఉన్నా
  • మళ్లీ వస్తాను: కరుణానిధి మనవడు, నటుడు ఉదయనిధి స్టాలిన్
తాను పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నానని త‌మిళ న‌టుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి మనవడయిన ఆయ‌న‌.. తాజాగా మీడియాతో మాట్లాడుతుండ‌గా రాజ‌కీయాల్లోకి వ‌స్తారా? అంటూ ఓ విలేక‌రి ప్ర‌శ్నించారు. దీనికి ఆయ‌న స‌మాధాన‌మిస్తూ, డీఎంకే పార్టీ తన రక్తంలోనే ఉందని, సినిమాల్లోకి రాకముందే రాజకీయాల్లో త‌న‌కు అనుభవం ఉందని అన్నారు.

కాక‌పోతే సినిమాల్లోకి వచ్చిన త‌రువాత తాను రాజకీయాల గురించి ఆలోచించకూడదు అనుకున్నానని ఉదయనిధి చెప్పారు. గ‌తంలో మాత్రం త‌న తండ్రి స్టాలిన్‌ కోసం చెన్నైలోని 'థౌజండ్ లైట్స్‌' ప్రాంతంలో ప్రచారంలో పాల్గొన్నాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల హాస‌న్ వంటి న‌టులు రాజకీయాల్లోకి వస్తోన్న నేప‌థ్యంలో తాను కూడా పూర్తి స్థాయిలో రాజ‌కీయాల్లోకి రావడానికి ఇదే మంచి స‌మ‌య‌మ‌ని అన్నారు.
dmk
karunanithi
stalin
udayanidhi stalin

More Telugu News