సావిత్రి సంప్రదాయం కొనసాగించి...యూనిట్ ను సర్ ప్రైజ్ చేసిన కీర్తి సురేష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సావిత్రి సంప్రదాయం కొనసాగించి...యూనిట్ ను సర్ ప్రైజ్ చేసిన కీర్తి సురేష్

  • మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్
  • సినిమా పూర్తయ్యే సమయంలో యూనిట్ కు బహుమతులిచ్చే సావిత్రి 
  • మహానటి షూటింగ్ చివరకు రావడంతో సావిత్రిలా బహుమతులిచ్చిన కీర్తి
  • బంగారు నాణేల బహుమతి చూసి ఆనందాశ్చర్యాలకు లోనైన యూనిట్ సభ్యులు


అలనాటి అందాల తార 'సావిత్రి' జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'మహానటి' సినిమా 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్‌ ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ స్వీట్‌ సర్‌ ప్రైజ్‌ ఇచ్చింది. మహానటి సావిత్రి నటిగా ఉన్న కాలంలో తన సినిమాకు పని చేసిన వారికి బహుమతులు ఇవ్వడం అలవాటు.

ఇప్పుడీ అలవాటును సావిత్రి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ కొనసాగిస్తూ, 'మహానటి' సినిమాకు పనిచేసిన యూనిట్‌ సభ్యులకు బంగారు నాణేలను గిఫ్ట్‌ గా ఇచ్చింది. కీర్తి ఇచ్చిన స్వీట్‌ సర్‌ ప్రైజ్‌ తో యూనిట్‌ సభ్యులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. కాగా, కోలీవుడ్ లో తాజాగా విజయం సాధించిన 'మెర్సల్‌' షూటింగ్ పూర్తయ్యాక ఆ చిత్ర యూనిట్ సభ్యులకు నటుడు విజయ్ గోల్డ్‌ కాయిన్స్ కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. 
keerti suresh
mahanati
savitri

More Telugu News