ఆస్కార్ నామినేషన్లను వెల్లడించనున్న ప్రియాంక చోప్రా
- షూటింగ్ ఫొటోలను షేర్ చేసిన అకాడమీ
- రేపు వీడియో రూపంలో నామినేషన్ల వెల్లడి
- షూటింగ్‌లో పాల్గొన్న మరికొంతమంది తారలు
ప్రియాంక షూటింగ్‌తో పాటు రెబల్ విల్సన్, మిషెల్ రోడ్రిగేజ్, రొసారియో డాసన్‌ల షూటింగ్ ఫొటోలను అకాడమీ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది. 2017 ముందు వరకు నామినేషన్ల జాబితాను ఎలాంటి అట్టహాసం లేకుండా అకాడమీ విడుదల చేసేది. కానీ గతేడాది నుంచి ఇలా కొంతమంది తారలను ఎంపిక చేసి, వారి చేత నామినేషన్ల పేర్లను చదివించిన వీడియోలను రూపొందించడం ప్రారంభించింది. దీని వల్ల అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచే అవకాశం కలుగుతుంది. మార్చి 4వ తేదీన ఈ అవార్డుల వేడుక జరగనుంది.